logo



ఇదే నా మన్మధుడు 2 బ్యాచ్ ..!

...

' ఇదే మన్మధుడు 2 బ్యాచ్ ' అంటూ నాగార్జున తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. కొన్నేళ్ళ  క్రితం నాగార్జున, సోనాలీ బింద్రే హీరో హీరోయిన్లుగా వచ్చిన ' మన్మధుడు' ఎంత హిట్టో అందరికీ తెలిసిందే. దానికి సీక్వెల్ గా రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో తాజా చిత్రం తెరకెక్కుతోంది. ఇక సినిమాలోని ప్రధాన పాత్రధారులంతా కలిసి ఓ సెల్ఫీ ఫోటోను తీసుకున్నారు. దీన్ని నాగార్జున అభిమానులతో పంచుకున్నారు. ఇందులో నాగార్జునతో పాటు హీరోయిన్ రాకుల్ ప్రీతి సింగ్, వెన్నెల కిషోర్, దర్శకుడు రాహుల్ రవీంద్ర, రావు రమేష్, లక్ష్మి, ఝాన్సీ, దేవ దర్శిణి,చైల్డ్ ఆర్టిస్ట్ లు ఉన్నారు.