పెథాయ్ తుఫాను వస్తుందని తెలియడంతో టెక్నాలజీని ఉపయోగించుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తుపాను వల్ల ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. తుపాను ప్రభావిత గ్రామాల్లో ఒక్కో కుటుంబానికి రూ. 2వేల విలువైన సరుకులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. అధికారులు బ్రహ్మండంగా పనిచేశారని చంద్రబాబు కొనియాడారు. మత్స్యకారులను ఎస్సీల్లో చేర్చాలని కేంద్రానికి ప్రతిపాదించామన్నారు. ప్రజల కోసం పనిచేసే ఏకైక పార్టీ టీడీపీ అని చంద్రబాబు స్సష్టం చేశారు.