స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 80 పాయింట్లకుపైగా లాభంతో ప్రారంభం కాగా నిఫ్టీ 10, 800 మార్క్ వద్ద కడలాడింది. టీసీఎస్ షేర్లు దాదాపు 1 శాతం నష్టాల్లో కొనసాగుతుండగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 0.5 శాతం నష్టపోయింది. బ్యాంకింగ్, వినియోగ, లోహ రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఉదయం 9.50 గంటలకు సెన్సెక్స్ 75 పాయింట్లకుపైగా లాభంతో 36,181 వద్ద నిఫ్టీ 19 పాయింట్లకుపైగా లాభంతో 10, 842 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ 70.46 వద్ద ఉంది. హెచ్ డీఎఫ్ సి, హిందాల్కో, ఐటీసీ, ఓఎన్ జిసి, ఐఓసీ షేర్లు లాభాల్లో ఉండగా భారతీ ఎయిర్ టెల్, టీసీఎస్ , హెచ్ సిఎస్ టెక్, భారతీ ఇన్ ఫ్రాటేల్, ఎ అండ్ ఏం షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.