కరోనా వైరస్ తగ్గాలి అంటే పూజలు చెయ్యాలి అనే ప్రచారం ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో బాగా జరుగుతుంది. దానిని కొంత మంది అమ్మోరు అంటూ ప్రచారం చేస్తున్నారు. అది మనం ఏమైనా తప్పులు చేస్తే ఆవహిస్తుంది అనే అభిప్రాయం జనాల్లో ఉంది. అందుకే కొందరు పూజలు చేయడం ఇష్టం వచ్చిన విధంగా ప్రవర్తించడం వంటి చర్యలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా సరే వ్యాక్సిన్ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు దాదాపుగా లేవు అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే కరోనా నిర్మూలన పేరుతో జార్ఖండ్‌లోని కోడెర్మా జిల్లాలో శాంతి పూజలు చేసారు. కరోనా నిర్మూలన అనే పేరుతో 400 గొర్రెలను బలి ఇచ్చారు. చంద్వారా బ్లాక్ పరిధిలో గల ఉర్వాన్ గ్రామంలోని అమ్మవారి ఆలయంలో ఈ ఘటన జరిగింది. కరోనాను శాంతింపచేయడానికంటూ పూజలు నిర్వహించారు.