ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. హైపవర్ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా రాష్ట్రమంతటా మొత్తం 11 వేలకు పైగా భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. విశాఖపట్నంకు సచివాలయం, హెచ్‌వోడి కార్యాలయాలు. రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజి, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ఇక అమరావతిలోనే మూడు అసెంబ్లీ సెషన్స్ జరగనున్నాయి. అటు భూములు ఇచ్చిన రైతులకు కౌలు 10 నుంచి 15 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ ఉపసంహరణ, అధికార వికేంద్రీకరణ బిల్లులకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇక ఇన్సైడర్ ట్రేడింగ్‌పై లోకాయుక్త విచారణ జరగనుంది. పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అధారిటీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.