దేశవ్యాప్తంగా ఇవాళ 8 రాష్ర్టాల్లో నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. ముంబైలో బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అమితాబ్-జయా బచ్చన్, ఐష్-అభిషేక్ దంపతులు జుహూలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. మరోవైపు సల్మాన్‌ఖాన్, కరీనాకపూర్ బాండ్రాలోని పోలింగ్ బూత్ నంబర్ 283 లో ఓటు వేశారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సతీమణి అంజలి, కుమారుడు అర్జున్, కూతురు సారాతో కలిసి బాండ్రాలో ఓటు వేశారు. సెలబ్రిటీలంతా ఓటేసిన అనంతరం పోలింగ్ కేంద్రం వద్ద సిరా గుర్తును మీడియాకు చూపించారు. ఓటర్లంతా పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని తారలంతా విజ్ఞప్తి చేశారు.