మహేంద్రసింగ్ ధోని, సాక్షిల ముద్దుల కూతురు జీవా ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ని బ్రేక్ చేస్తున్నాయి. సూపర్ స్టార్ షారూఖ్‌తో జీవా సరదా ఆటలు ఆడుతూ ఫోటోలకి ఫోజులిచ్చింది. వీరిద్దరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, వారి ఫోటోలని వైరల్‌గా మారుస్తున్నారు అభిమానులు. ఏప్రిల్ 9న కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన జరిగింది. ఐపీఎల్లో ధోని ఆడుతున్న ప్రతి మ్యాచ్‌కి జీవా హాజరు కాకవడమే కాక, తన తండ్రిని ప్రోత్సహిస్తూ ఉంటుంది. గత నెలలో జరిగిన ఓ మ్యాచ్‌కి హాజరైన జీవా.. గో పప్పా అంటూ కేకలు వేసింది. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్ అయింది.