logo



గుంటూరులో తెదేపా ఆవిర్భావ వేడుకలు

...

గుంటూరులోని తెదేపా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 38వ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి నక్కా ఆనంద్ బాబు, ఎంపీ గల్లా జయదేవ్, పలువురు నేతలు నివాళులర్పించారు. తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచ నలుమూలల చాటి చెప్పిన మహానాయకుడు నందమూరి తారకరామారావు అని మంత్రి నక్కా ఆనంద్ బాబు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ ఇదేనని అన్నారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడడానికి ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని గల్లా జయదేవ్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, తెలుగు ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నా మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు.