logo


సినిమా వార్త చెప్పు భయ్యా

...

రాకింగ్ స్టార్ గా అతి తక్కువ టైం లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో మంచు మనోజ్.బిందాస్, కరెంట్ తీగ, పోటుగాడు వంటి హిట్లతో ఆకట్టుకోగా, కొన్ని యావరేజ్ హిట్లను సైతం తెచ్చుకున్నాడు. కానీ గత మూడేళ్లుగా ఓ హిట్ కూడా లేకుండా ఉండిపోయాడు. కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా రాని పరిస్థితిలో ఆయన సినిమాలు నిలిచాయంటే గ్రాఫ్ ఎంత దారుణంగా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఏ సినిమా చేయాలో తెలియని పరిస్థితి లో ఉన్నాడు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లో బాగా యాక్టివ్ అయ్యాడు. ఏదైనా కొత్త ట్రైలర్ వస్తే స్పందిస్తున్నాడు. అలాగే అభిమానులతో చిట్ చాట్లు చేస్తున్నాడు. ఇలా అన్నీ చేస్తున్నాడు కానీ తన కొత్త సినిమా సంగతి మాత్రం చెప్పలేకపోతున్నారు. దీంతో ఆయన అభిమానులంతా సినిమా వార్త చెప్పు భయ్యా అని కామెంట్స్ పెడుతున్నారు. మరి మనోజ్ నుండి కొత్త సినిమా వార్త  ఎప్పుడు చూస్తామో.