logo


అన్న కి రాఖీ కట్టాలని వెళ్తే ...రెండు రోజులు రేప్

...

ఆధునికత పెరిగే కొద్ది మానవత విలువలు మంటగలిసి పోతున్నాయి. కామాంధులు రెచ్చిపోతున్నారు. వావి వరసలు మంటగలిసిపోతున్నాయి. అన్నయ్యా అంటూ రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలిపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రక్షాబంధన్ రోజున రాఖీ కట్టడానికి వచ్చిన సోదరి పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిహార్ లోని బంద నగరం తింద్వారీకి చెందిన 15 సంవత్సరాల బాలిక రక్షాబంధన్ రోజున అన్నయ్య వరసయ్యే యువకుడికి రాఖీ కట్టడానికి అతని ఇంటికి వెళ్లింది. అదే అదునుగా తీసుకున్న ఆ కీచకుడు బాలికను బంధించాడు. రెండు రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.