logo


సెప్టెంబర్ 6న ప్రభాస్ కొత్త సినిమా లాంచ్..!

...

ప్రస్తుతం యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సుజిత డైరెక్షన్లో సాహో సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే ' జిల్' ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్లో మరో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. సెప్టెంబర్ 6న ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరపబోతున్నారు. ఈ సినిమా పూర్తి రోమాంటిక్ ప్రేమ కథగా ఉండబోతుందని తెలుస్తుంది. ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా చాలా వరకు యూరప్ కంట్రీలో షూటింగ్ జరుపుకోనుంది. యు.వి.క్రియేషన్స్ తో కలిసి ప్రభాస్  సొంత బ్యానర్ గోపి కృష్ణ  మూవీస్ వారు ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇక సాహో విషయానికి వస్తే ఈ చిత్ర షూటింగ్  హైదారాబాద్ లోని  రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. భారీ  బడ్జ్ట్ తో యూవీ క్రియెషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో ముందుకు రానుంది.