logo


కూరగాయలమ్మ కూరగాయలు..!

...

కూరగాయలమ్మా కూరగాయలు నవనవ లాడే వంకాయలమ్మా.. లేత బెండకాయలు అంటూ సమంత రెగ్యులర్ గా కూరగాయలు అమ్మేవాళ్ళు అరిచినట్లు అరవలేదు గాని జామ్ బజార్ లో కూరగాయలమ్మే వనిత దగ్గరకు వెళ్ళి నేను కూరగాయలు అమ్మోచ్చా  అని అడిగింది. హృద్రోగం తో  బాధపడుతున్న పిల్లలకు ఇలాంటి కార్యక్రమం ద్వారా డబ్బు సమకూర్చే  ప్రయత్నం చేస్తున్నామని వివరించింది. అసలే  మంచి ఉద్దేశం పైగా సమంతా లాంటి స్టార్ హీరోయిన్ ఏకంగా వచ్చి అడిగితే ఎవరు కాదంటారు ఆమె సంతోషంగా ఒప్పుకుంది. ఇక మొదలైంది ధమాకా సెల్.

అవసరమైన వాళ్ళే కాదు అవసరం లేని వాళ్ళు అసలు కూరగాయలు జన్మలో ఒక్కసారి కూడా కొని ఇంటికి తీసుకెళ్ళని వాళ్ళు అందురూ వచ్చి సామ్ దగ్గర కూరగాయలు కొనడం మొదలు పెట్టారు. కాసేపట్లో సరుకంతా హుష్ కాకి. జస్ట్ కొనడం కాదు అసలు బేరమే లేదు రేట్లు ఎంత అని కూడా అడగకుండా పెద్ద పెద్ద నోట్లు ఇచ్చిమరీ కూరగాయలు పట్టుకెళ్ళారు. మామూలు కూరగాయాలా అవి .. 

సమంతా బ్రాండ్ కూరగాయలు రోజూ దొరకవు కదా!