logo


బాబాయ్ కు సర్ ప్రైజ్ అంటున్న అబ్బాయ్..!

...

రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఉన్న మెగా అభూమానులు మరో వేడుక కోసం సిద్ధమవుతున్నారు. రేపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినోత్సవం అనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవర్ స్టార్ జన్మదినోత్సవ వేడుకలను వైభవంగా జరిపేందుకు మెగా అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. 

ఈ నేపథ్యంలో బాబాయ్ పవన్ కల్యాణ్ కు ఓ సర్ప్రైజ్ బర్త్డే గిఫ్ట్ ఇవ్వనున్నట్లు మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తేజ్ తెలిపాడు. ఈ మేరకు తన ఫేస్బుక్ పేజీలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. హాయ్ ప్రెండ్స్ మీ అందరికి ఓ సర్ ప్రైజ్ ఉంది. బాబాయ్ జన్మదినోత్సవం సందర్భంగా 24 గంటల్లో ఆ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. బాబాయ్ నీకోసం నా దగ్గర ఓ సర్ఫ్రైజ్ ఉంది' అంటూ ఆ వీడియోలో చెర్రీ పేర్కొన్నాడు. ఆ సర్ప్రైజ్ ఏంటో               తెలుసుకోవాలనుకుంటే రేపు ఉదయం వరకు వెయిట్ చేయాలని పేర్కొన్నాడు.