logo

మరికాసేపట్లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్న కొండా మురళి..!

...

కాంగ్రాస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ కొండా మురళి రాజీనామాకు రంగం సిద్ధమయింది. తనకు పదవులు ముఖ్యం కాదని, ఆత్మగౌరవమే ముఖ్యమని మురళి ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ ఎస్ పార్టీలో ఉండగా అందుకున్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ అపాయింట్ మెంట్ కోరగా, ఆయన ఈరోజు తనను ఛాంబర్ లో కలుసుకోవాలని సూచించారు. ఈరోజు ఉదయం 10;30 గంటలకు స్వామిగౌడ్ కలుసుకొనున్న కొండా మురళి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సమర్పించనున్నారు. తెలంగాణ ఎన్నికలకు ముందు పార్టీ మారిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని టీఆర్ ఎస్ ఇప్పటికే సభాపతికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన చర్యలు తీసుకుని తొలగించకముందే గౌరవం తప్పుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మురళి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.