logo


కాలం ఎంత వేగంగా పోతుంది.మా అబ్బాయికి అప్పుడే 12 ఏళ్ళు వచ్చేశాయ్..!

...

తెలుగు ఇండస్ట్రీలో కుటుంబానికి విలువ ఇచ్చే హీరోలు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో మహేష్ బాబు ఒకరు. ఏ చిత్రం షూటింగ్ పూర్తయినా సరే వెంటనే తన ఫ్యామిలీతో విదేశాలకు వెళ్ళిపోతాడు. ఇక మహేష్ బాబుకి తన కొడుకు గౌతమ్ కృష్ణ అంటే ఎంత ఇష్టమో చెప్పాల్సిన పని లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఈరోజు 12వ పుట్టిన రోజును జరుపుకొనున్నాడు. 

ఈ నేపథ్యంలో మహేష్ తన కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్ స్ట్రాగామ్ లో తన కొడుకు కోసం ఓ పోస్ట్ చేశాడు. 'కాలం చాలా వేగంగా గడిచిపోతుంది. అప్పుడే నా కుమారుడికి 12 ఏళ్ళు వచ్చేశాయి. నా ప్రియమైన గౌతమ్ ఘట్టమనేనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు ఎదుగుతుంటే చూడటం చాలా ఆనందంగా ఉంది' అని మహేష్ ఇన్ స్టాగ్రామ్ లో స్పందించాడు. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ సైతం తన కుటుంబ సభ్యులకు ఎంతో ప్రాదాన్యత ఇచ్చేవారిని అప్పట్లో వరుసగా చిత్రాల్లో నటిస్తున్న కృష్ణ ఏ మాత్రం విరామం దొరికినా తన పిల్లలతో గడిపేవారని చెబుతుంటారు.