logo


అధికారిక లాంఛనాలతో ఇవాళ అంత్యక్రియలు..!

...

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సినీనటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారక లాంఛనాలతో జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మెహదీపట్నంలోని ఆయన స్వగృహం వద్ద మధ్యాహ్నం 2;30 గంటల నుంచి హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభంకానుంది. సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మెహదీపట్నంలోని ఆయన స్వగృహంలో ఉంచిన హరికృష్ణ పార్థీవ దేహాన్ని ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల సందర్శించి నివాళులు అర్పించారు.