logo


చాలా పెద్ద షాక్ అల్లు అర్జున్..!

...

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, నటుడు నందమూరి హరికృష్ణ మృతి వార్తతో ఎంతో మంది, రాజకీయ నాయకులు షాక్ అవుతున్నారు. ఈరోజు తెల్లవారుజూమున జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. ఈ వార్త వినగానే ఎంతో మంది ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. తాజాగా అల్లు అర్జున్ కూడా హరికృష్ణ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఈ వార్త వినగానే తాను షాక్ కు గురయ్యనని తెలిపాడు. నేను ఇండియాలో లేను. ఇప్పుడే ఆ చెడు వార్త విన్నాను. చాలా చాలా పెద్ద షాక్.. నందమూరి కుటుంబ సభ్యులకు, కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ లకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. హరికృష్ణ గారి ఆత్మకు శాంతి చెరుకూరాలని కోరుకుంటున్నాను' అంటూ బన్నీ ట్వీట్ చేశాడు.