logo

శ్రీధర్‌బాబు బెయిలు పిటిషన్‌ విచారణ వాయిదా.

...

ఈనాడు, హైదరాబాద్‌: మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద చిక్కడపల్లి ఠాణాలో తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలుకు మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శ్రీధర్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ..మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని కోరారు. అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(ఏపీపీ) డి.రామిరెడ్డి ఆ అభ్యర్థనపై అభ్యంతరం వ్యక్తంచేశారు. పూర్తి వివరాలు సమర్పించాలని ఏపీపీకి స్పష్టం చేసిన న్యాయమూర్తి తదుపరి విచారణను సోమవారం చేపడతామని పేర్కొన్నారు.