logo


కలవాలి తమ్ముడు అన్నారు.. అంతలోనే..!

...

హరికృష్ణ వెళ్ళిపోయారు. ఇక నాకు అంతా శూన్యంలా ఉంది. అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున. నటుడు, రాజకీయ నేత హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారని తెలియగానే నాగార్జున దిగ్భృంతి వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని ట్విటర్ వేదికగా గుర్తుచేసుకున్నారు. 'చాలా రోజులు అయ్యింది నిన్ను చూసి, కలవాలి తమ్ముడు. ఈ మాటలు కొన్ని వారాలు క్రితమే ఆయన నాతో చెప్పారు. ఇప్పుడు వెళ్ళిపోయారు. నాకు అంతా శూన్యంలా ఉంది. ఐ మిస్ యూ అన్నా' అని నాగార్జున ఆవేదన చెందారు. 

ఈ సందర్భంగా 'సీతారామరాజు'  చిత్రంలో ఓ ఫోటోను పంచుకున్నారు. 'సీతారామరాజు' చిత్రంలో హరికృష్ణ, నాగార్జున అన్నదమ్ములుగా నటించారు. బయట కూడా సొంత అన్నాదమ్ముల్లానే ఉండేవారు. హరికృష్ణతో తనకు ప్రత్యేకమైన బంధం ఉందని నాగార్జున పలు సందర్భాల్లోనూ చెప్పారు.