logo


నందమూరి ఫ్యామిలీని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు.!

...

నందమూరి కుటుంబ సభ్యులకు జరుగుతున్న వరుస ప్రమాదాలు నందమూరి అభిమానులను కలవరపెడుతున్నాయి. ఒకే జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రమాదానికి గురి కావడం అందర్నీ షాక్ లో పడేస్తుంది. నాలుగేళ్ల కిందట నల్లగొండ జిల్లా మునగాల మండలం ఆకుపాము వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ మృతి చెందాడు. 2014 డిసెంబరు 6న హైదారాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహానం ట్రాక్టర్ ను తప్పించబోయి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడిక్కడే మరణించారు.

 నాడు తనయుడి మరణవార్త తెలియగానే కుప్పకూలిపోయిన హరికృష్ణ దేవుడు నన్ను మోసం చేశాడంటూ రోదించారు. పెద్ద కుమారుడి మాదిరిగానే ఆయన కూడా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అందర్నీ బాధ పెడుతుంది. అంతకు ముందు 2009      ఎన్నికల సమయంలో టీడీపీ తరపున  ప్రచారం చేసిన నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా   రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకుని       హైదారాబాద్కు తిరిగి వస్తుండగా  నల్లగొండ జిల్లా మోతే వద్ద ఆయన ప్రయాణిస్తోన్న       వాహనం  ప్రమాదానికి గురయ్యింది.  దేవుడి దయ వల్ల ఎన్టీఆర్ గాయాలతో బయటపడ్డాడు. ఇప్పుడు అదే జిల్లాలో  హరికృష్ణ రోడ్డుప్రమాదంలో మరణించారు       దీంతో నందమూరి కుటుంబాన్ని వరుస రోడ్డు ప్రమాదాలువెంటాడుతున్నాయని అంత మాట్లాడుకుంటున్నారు. 

హరికృష్ణ మరణ వార్త తెలుసుకున్న ఎన్టీఆర్ హుటాహుటిన నార్కెట్ పల్లి బయలుదేరి వెళ్లారు. కొద్ది సేపటి క్రితమే ఎన్టీఆర్ నార్కెట్ పల్లి కామినేని హాస్పిటల్ కు చేరుకున్నారు. తండ్రి పై జూనియర్ ఎన్టీఆర్ కు ప్రేమ, గౌరవం ఉన్నాయి. తండ్రి మాటను జవదాటని జూనియర్ ఎన్టీఆర్ , తండ్రి మరణ వార్తను విని షాక్ అయ్యారు.