logo



మోదీ పర్యటన ... ఏపీకి ఏం చేశారో చెప్పడానికే కన్నా

...

నాలుగున్నరేళ్లలో ఏపీకి ఏం చేశారో చెప్పేందుకే ప్రధాని మోదీ గుంటూరు పర్యటనకు వస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. మోదీ పర్యటనను అడ్డుకోడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మోదీ సభకు బస్సులు పెట్టకుండా అడ్డుకుంటున్నారని, ప్రైవేటు వాహనాలను ఎక్కికక్కడ సీజ్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా మోదీ సభను విజయవంతం చేసి తీరుతామని స్పష్టం చేశారు. ప్రజలు కూడా మోదీ చెప్పబోయే వాస్తవాలు తెలుసుకోవాలని కన్నా లక్ష్మీనారాయణ కోరారు.