logo


పుట్టిన తొలి పెంగ్విన్ పిల్ల మృతి ...

...

దేశంలో తొలిసారిగా జన్మించిన పెంగ్విన్ మృతి చెందింది. పెంగ్విన్ పిల్ల బుధవారం (ఆగస్టు22న) రాత్రి మృతి చెందినట్లు జీజామాత ఉద్యాన అధికారులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 15న రాత్రి ఎనిమిది గంటలకు ముంభైలోని జీజామాతజూలో పెంగ్విన్ జన్మించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పెంగ్విన్ పిల్ల హుషారుగా, ఆరోగ్యంగా ఉందని అధికారులు ప్రకటించారు. మిస్టర్ మొల్డ్, ఫ్లిప్పెర్ అనే పెంగ్విన్లకు  ఈ బుల్లి పెంగ్విన్ జన్మించింది.  దీన్ని  కాపాడేందుకు అన్నీ విధాలుగా చర్యలు తీసుకున్నామని  చెప్పిన అధికారులు మృతికి గల కారణాలను వెల్లడించలేదు. కాగా, పెంగ్విన్ ల సంరక్షణ కోసం రూ. 2.5కోట్లు ఖర్చు చేస్తుండటం గమనార్హం. హంబోల్ట్ పెంగ్విన్లను  2016లో ఈ జూకి తీసుకొచ్చారు.