logo


కాళ్లు, చేతులు కట్టేసి మహిళ పై కత్తులతో దాడి...

...

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై దుండగుడు హత్యాయత్నం చేశాడు. ఆమె కాళ్లు కట్టేసి చేతులు నరికి అమానుషంగా దాడి చేశాడు.  వైష్ణవి బ్యూటీ పార్లర్ లో పని చేస్తున్న ఆ మహిళ తన భర్తతో విడిపోయి పాపతో బాపులపాడు పాలకేంద్రం వద్ద నివాసముంటోంది. అయితే గత కొంతకాలంగా ఓ వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న ఆ మహిళను స్థానికులు గుర్తించి హనుమాన్ జంక్షన్ పోలీసులకు సమాచారం అందించారు. కోన ఊపిరితో ఉన్న మహిళను 108 వాహానంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రియుడే ఈ దాడికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.