logo


అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం

...

పెనుకొండ మండలం సత్తారుపల్లి గ్రామం దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలు ఉన్నాయి. గోపాల్ రెడ్డి, అంజినప్ప, రవీంద్రారెడ్డి, వెంకటప్ప, వడ్డే అంజి, వెంకటస్వామి మృతిచెందగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ధర్మావరంలో జరుగుతున్న పెళ్ళికి వెళ్ళేందుకు బొలేరో వాహానంలో వెళ్తుండగా వాహనం సత్తారుపల్లి వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఆరుగురు మృతిచెందగా 10మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన ప్రదేశం వద్ద రక్తం దారాలుగా పడి ఉంది. అలాగే పెళ్ళికి వెళ్తున్నందున అందురూ కొత్త బట్టలు, తెల్లని వస్త్రాలు ధరించి ఉండడంతో అవన్నీ రక్తపు మరకలతో నిండిపోయాయి.