logo


మా రాఖీ వరద బాధితులకు రక్ష

...

 

కేరళలో జలవిలయం ధాటికి అల్లాడుతున్న ప్రజలను ఆదుకోవడానికి దేశవ్యాప్తంగా అందరూ స్పందిస్తున్నారు. అదే తరహాలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్ధినిలు ముందుకొచ్చారు. తాము స్వయంగా తయారు చేసి విక్రయించనున్న రాఖీలు వరద బాధితులకు రక్ష అనే సందేశంతో వారు రాఖీలను సిద్ధం చేస్తున్నారు. ఈ పాఠశాలలో 1100 మంది విద్యార్ధినులు ఉన్నారు. వీరిలో 150 మందికి కార్ఫెడ్ స్వచ్ఛంద సంస్థ రాఖీల తయారీలో శిక్షణ ఇవ్వడంతో పాటు అవసరమైన సామగ్రిని ఉచితంగా అందిస్తోంది. వీటిని అమ్మగా వచ్చిన డబ్బులను విద్యార్ధినులు కేరళ వరద బాధితుల సహాయ నిధికి జమ చేయనున్నారు. న్యాయసేవా సదన్ జిల్లా కార్యదర్శి భవానీ తొలి రాఖీని కొనుగోలు చేసి వీరిని అభినందించారు.