logo


రౌడీలకు విజయ్ వార్నింగ్..!

...

అభిమానం హద్దులు దాటుతుంది. కొందరి అభిమానులు వల్ల హీరోలకే చెడ్డ పేరు వస్తుంది. ఒకరిపై వున్న అభిమానంతో మరొకరిని కించపరుస్తూ మాట్లాడే ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. హీరో విజయ్ దేవరకొండకి కూడా ఇదే పరిస్థితి ఎదురైయింది. దీంతో ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. నన్ను అభిమానంగా ప్రేమించే ఎంతోమంది నా ఫోటోను డీపీగా పెట్టుకున్నారు. అయితే,మీలో కొందరి మాటలు కయ్యానికి కాలు దువ్వెలా ఉండటం నేను గమనించాను. నేను అలా ఎప్పటికీ చేయను.దయచేసి మీరుకూడా అలా చేయకండి. కొందరి మాటలు బాధ కలిగించవచ్చు. అయితే,నా పనేదో నాది. మరో          విషయం గురించి నేను ఆలోచించను. బతుకుదాం. బతకనిద్దాం. ''ఇప్పటికీ ద్వేషం ఉంటే మనం చేయాల్సిందల్లా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మనం సంతోషంగా ఉండేలా ముందుకు సాగడమే. ఆన్లైన్ వేదికగా దుర్భాషలడటం మాత్రం చూడాలనుకోవడం లేదు. ఎల్లప్పుడూ ప్రేమతో మీ రౌడీ'' అంటూ ట్వీట్ చేశారు విజయ్.