logo


జీవితంలో నేనెప్పుడూ ఇంత ద్వేషంతో కూడిన విమర్శలు..ఎదుర్కొలేదు

...

 

సంవత్సరానికి మూడు సినిమాలు చేసినప్పుడు కూడా ఎదుర్కొని ఒత్తిడిని, గత మూడు నెలల కాలంలో ఎదుర్కొన్నానని నేచురల్ స్టార్ నాని చెప్పాడు. 'బిగ్ బాస్' షో కోసం నాని తొలిసారి వ్యాఖ్యాతగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల 'బిగ్ బాస్' రెండో సీజన్ పూర్తయింది. ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా తాను ఎదుర్కొన్న ఒత్తిడి గురించి  మీడియాకు  ఇంటర్వ్యూ ఇచ్చాడు.'బిగ్ బాస్'' కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించకముందు నేను ఓ చిన్న ప్రపంచంలో బతికేవాడిని. కానీ, కార్యక్రమం నాకు నిజమైన ప్రపంచాన్ని పరిచయం చేసింది. ప్రపంచంలో మంచివాళ్లతో పాటు  అన్నీ రకాల మనుషులా ఉంటారని అర్థమైంది. జీవితంలో నేనెప్పుడూ ఇంత ద్వేషంతో కూడిన విమర్శలను ఎదుర్కొలేదు. ప్రపంచంలోని మనుషులందరిని మెప్పించలేమని ఈ కార్యక్రమం ద్వారా అర్థమైంది. గత మూడు నెలల్లో నేను చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నాను. ఏడాదికి మూడు సినిమాలు చేసినపుడు కూడా నేను ఇంత ఒత్తిడిని ఎదుర్కొలేదు అని చెప్పాడు.