logo


సినిమాల సక్సెస్ మూడ్ లో.... ఉన్న అక్కినేని ఫ్యామిలీ

...

అక్కినేని ఫ్యామిలీ సభ్యులంతా ఎంజాయ్ మూడ్లో మునిగిపోయారు. మొన్నటి వరకు ప్రతి ఒక్కరు తమతమ సినిమాలతో బిజీగా ఉండడం అసలు కలవడానికి కుదరలేదు ఇక ఇప్పుడు అందరికి ఖాళీ సమయం దొరకడంతో అంత ఒకటై, టైం స్పెండ్ చేస్తున్నారు. నాగచైతన్య శైలజా రెడీ అల్లుడు, సమంత యుటర్న్, నాగార్జున దేవదాస్ ఈముగ్గురు నటించిన సినిమాలు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకోవడంతో   వీరంతా ఆ సక్సెస్ సంబరాలను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నట్లు నాగార్జున తెలిపాడు. వీరితో పాటు అఖిల్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. అఖిల్ నటిస్తున్న మిస్టర్ ముజ్ను చిత్రానికి కాస్త బ్రేక్ దొరకడంతో  ఫ్యామిలీ ట్రిప్లో అఖిల్ కూడా జాయిన్  అయ్యాడు. ప్రస్తుతం చైతు సవ్యసాచి సినిమా చేస్తుండగా, సమంత నందిని రెడ్డి డైరెక్షన్లో ఓ సినిమాకు ప్లాన్ చేసింది. నాగ్ సైతం హిందీ, తమిళ సినిమాలతో బిజీగా ఉన్నాడు.