logo


కుప్పకూలిన భారత నావికాదళ హెలికాప్టర్ ..!

...

 

భారత నావికాదళానికి చెందిన చేతక్ హెలికాప్టర్ కూలిపోయింది. తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపం అరక్కోణంలోని ఐఎన్ఎస్ రాజాలి నావికస్థావరం దగ్గర్లోనే చేతక్ సిహెచ్ 442 కూలింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో ముగ్గురు సిబ్బంది ఉండగా అందరూ  సురక్షితంగా బయటపడ్డారని నావికాదళ  అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. హెలికాప్టర్ సాధారణ శిక్షణలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. క్రాష్ ల్యాండ్ కావడంతో ప్రధాన,వెనుక భాగంలో ఉండే రోటోర్స్ దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది. సెప్టెంబర్ 4న భారత వాయుసేనకు చెందిన మిగ్ 27 విమానం రాజస్థాన్ లోని జోధ్పూర్  వద్ద కుప్పకూలిన సంగతి తెలిసిందే.