logo


విండీస్ సిరీస్ లో మయంక్ కు స్థానం ..!

...

తదుపరి సిరీస్ వెస్టిండీస్ తో జరగబోయే రెండు టెస్టుల కోసం కర్ణాటక ఆటగాడు మాయాంక్ అగర్వాల్ బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మంచి ఫామ్ తో జట్టులో స్థానం సంపాదించిన మాయాంక్ దేశవాళీ సీజన్ లో కూడా పరగుల వరద పారించాడు. ఓ ఇంగ్లీషు ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియాలో మీకు ప్రేరణ కలిగించిన వ్యక్తి ఎవరు అన్న ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ తన మీద రాహుల్ ద్రావిడ్ ప్రభావం ఉందని, ఆయనిచ్చిన ప్రేరణతోనే జట్టులో స్థానం సంపాదించగలిగానని మాయాంక్ అన్నాడు. ఆయనిచ్చే సలహాలు, సూచనలు నేను ఎప్పుడు పాటిస్తుంటానని, అవి నాకో ఎన్నో సందర్భాల్లో ఉపయోగపడ్డాయి అని తెలిపాడు.