logo


తెలంగాణను అభివృద్ధి చేసే సామర్థ్యం టిడిపీ కే ఉంది

...

ఈరోజు సినీనటుడు బాలకృష్ణ ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రల సరిహద్దు గ్రామమైన జొన్నల గడ్డ నుండి అభిమానులు కార్యకర్తలు వందలాది మోటారు సైకిళ్ల ర్యాలీతో బాలకృష్ణకు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా మండంలోని రాయపట్నం గ్రామంలోని ఎన్టీఆర్,అంబేద్కర్ విగ్రహాలకు   బాలకృష్ణ పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు.తరువాత అభిమానులను ఉద్దేశించి బాలకృష్ణ మాట్లాడారు. తెలుగు జాతికీర్తి ప్రతిష్టాలను ప్రపంచానికి చాటిన మహనీయుడు      ఎన్టీఆర్ అని కొనియాడారు.టిడిపితోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఎన్టీఆర్, చంద్రబాబు ఎంతో కృషి చేశారని  ఆయన అన్నారు.