logo


ఈ రోజు సెబాస్టియన్, ఉదయ్ సింహాలను విచారించడం లేదు ..!

...

ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న సెబాస్టియన్, కొండల్ రెడ్డి , ఉదయ సింహలను ఈరోజు విచారించడం లేదని ఐటీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల పరిశీలన జరగుతోందన్నారు. ఈనెల 3వతేదీన రేవంత్ రెడ్డి, ఆయన బంధువు ఇళ్లతో పాటు సెబాస్టియన్, ఉదయ్ సింహా ఇళ్లలో సోదాలు జరిపిన ఐటీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు, ఆదాయ వ్యయాలకు సంబంధించిన డిటేల్స్ను తమ ముందు ప్రవేశపెట్టాలని  ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.