logo


అనుపమతో సెల్ఫి కోసం పోటీపడిన హిజ్రాలు ..!

...

ప్రేమమ్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన కేరళ ముద్దుగుమ్మ అనుపమపరమేశ్వరన్. అచ్చ తెలుగు ఆడపిల్లలా కనిపించే ఈ అమ్మడు తన అందం, నటనతో అభిమానులను బాగా సంపాదించుకుంది. శతమానం భవతి సినిమాతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీని వరుస అవకాశాలు పలకరిస్తున్నాయి. ప్రస్తుతం హీరో రామ్ సరసన 'హలో గురు ప్రేమకోసమే' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అనుపమా పరమేశ్వరన్ ఈరోజు హైదరబాద్, కూకట్పల్లిలోని  సుచిత్ర సర్కిల్ లో వీఆర్కె సిల్క్స్ కు ముఖ్య అతిథిగా హాజరై షోరూంను ప్రారంభించింది. ఈ సందర్భంగా అనుపమతో ఫోటోలు దిగేందుకు హిజ్రాలు పోటీ పడ్డారు.ఒక్కసారిగా వచ్చి తనను అనుపమ కాస్త ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది.