logo


కిడారి కి నివాళ్ళు ...కుటుంబ సభ్యులను ఓదార్చిన బాబు ..!

...

పాడేరులో కిడారి సర్వేశ్వరరావు కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. కిడారి చిత్రపటానికి పూలు జల్లి సీఎం నివాళులర్పించారు. అనంతరం కిడారి కుటుంబ సభ్యులను చంద్రబాబు ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు చినరాజప్ప, నక్కా ఆనందబాబు, ఎమ్మేల్యేలు పంచకర్ల రమేష్ బాబు, గిడ్డి ఈశ్వరి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాడేరు నుంచి అరకు చేరుకుని మావోల కాల్పుల్లో కిడారితో పాటు చనిపోయిన సోమ కుటుంబ సభ్యులను పరామర్శించారు. గత ఆదివారం విశాఖ జిల్లా లివిటిపుట్టలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే సోమను అతిదారుణంగా మావోయిస్టులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే.