logo


తమ్ముడిని అక్టోబర్ 10 వెండితెరకు పరిచయం చేయనున్న ..విజయ్ దేవరకొండ

...

అంతకు ముందు ఎన్ని సినిమాల్లో నటించినప్పటికి విజయ్ దేవరకొండ కెరీర్కు 'అర్జున్ రెడ్డి' ని టర్నింగ్ పాయింట్గా చెప్పవచ్చు.ఈ యాంగ్ హీరో ఇప్పుడు తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు. తన తమ్ముడిని టాలీవుడ్కి పరిచయం చేసేందుకు ఇదే సరైన సమయంగా భావించిన విజయ్ దీనికోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. తెలంగాణ నేపథ్యానికి సంబంధించిన కథతో ఆనంద్  వెండితెరకు పరిచయం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాలో రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్గా నటించనుందని తెలుస్తోంది. సురేష్ బాబు సమర్పణలో  తెరకెక్కనున్న ఈ సినిమాకు కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించనున్నారు. అక్టోబర్ 10న ఈ షూటింగ్ ప్రారంభం కానుంది.