logo


బోయపాటి సినిమా పనులు ఫిక్స్ చేశాడు

...

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ అజర్ బైజాన్ దేశంలో భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు ఓ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. సెప్టెంబర్ 30 కల్లా ఇక్కడ షూటింగ్ అంత పూర్తి చేసి అక్టోబర్ 1న హైదరబాద్ లో యూనిట్ సభ్యులు ఉండాలని చూస్తున్నారు. హైదరబాద్ కు వెళ్ళగానే మిగిలిన షూటింగ్ అంత పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలని అలాగే జనవరి ఫస్ట్ వీక్ కల్లా సినిమాకు సంబంధించిన అన్నీ పనులు పూర్తి చేయాలని బోయపాటి యూనిట్ సభ్యులు చెప్పారట. ఇక బోయపాటి చెప్పినట్లే చిత్ర యూనిట్ రేయిపగలు కష్టపడుతున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ సంగీతం అందిస్తుండగా, కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.