logo


వివాహేతర సంబంధాలు నేరం కాదు.. సుప్రీం !

...

 

వివాహేతర సంబంధాలు క్రిమినల్ నేరం కాదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఇష్టపూర్వక శృంగారాన్ని నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించింది. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 497 పురాతన చట్టమని రాజ్యాంగ సమ్మతమైనది కాదని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యులు ధర్మాసనం తీర్పు వెలువరించింది. సెక్షన్ 497 కాలం చెల్లిన చట్టంగా పేర్కొంది. మహిళలకు  సమానహక్కులు కల్పించాలన్న స్ఫూర్తికి సెక్షన్ 497తో తూట్లు పడుతున్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. మహిళల సమానాత్వానికి అడ్డుపడే ఏనిబంధన అయిన రాజ్యాంగపరమైనది కాదని వ్యాఖ్యానించింది . వివాహమైతే పురుషులు భార్యలను తమ  ఆస్తిగా భావిస్తున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే వివాహేతర సంబంధాల కారణంతో విడాకుల తీసుకోవచ్చని, దాన్ని నేరంగా పరిగణించలేమని కోర్టు స్పష్టంచేసింది.    వివాహేతర సంబంధాల చట్టంలోని పలు నిబంధనలు వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే కేంద్రం చట్టాన్ని సమార్థిస్తూ వాదనలు వినిపించింది. వివాహేతర సంబంధం నేరుగా  పరిగణిస్తే వివాహ పవిత్రతకు రక్షణ ఉంటుందని  వాదించింది. అయితే కోర్టు ఆ వాదనతో అంగీకరించలేదు. ఇష్టపూర్వక   శృంగారం నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టంచేసింది. సెక్షన్ 497 పురాతన చట్టమని తెలిపింది. చాలా దేశాలు ఈ తరహా  చట్టాలను తొలగించాయని కోర్టు ఈ సందర్భంగా తెలియజేసింది.