logo


హాట్ మూవిలో కైరా ఇంకెంతగా రెచ్చిపోతుందో ..!

...

తెలుగులో భారత్ అనే నేను చిత్రం తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కైరా అద్వానీ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని తన సత్తా చాటుకుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఓ సినిమా చేస్తుంది. యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగానే తాజాగా ఓ హాట్ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ లో ఈమె హీరోయిన్ గా నటించేందుకు ఒకే చెప్పిందట. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ మూవిలో ఈ హాట్ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన అర్జున్ రెడ్డి, హిందీ వెర్షన్ కు కూడా ఈయనే డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగులోనే హాట్ లిప్ లాక్ లను చూపించిన సందీప్ ఇక హిందీ వర్షన్ లో ఇంకెన్ని ముద్దుల సీన్లు పెడతాడో వాటికి కైరా ఇంకెంతగా రెచ్చిపోతుందో అని అంత అనుకుంటున్నారు.