logo


సి ఎం చంద్రబాబు ప్రతి అడుగు నవ్యాంధ్ర ప్రజల భవిషత్తు కోసమే

...

ఓ పక్క వర్షం, మరోపక్క కాలినడక ...ఆ శ్రమ ఆంధ్రులకు మేలు చేకూర్చాలనే... ఇక్కడ , అక్కడని లేదు ..ఎక్కడైనా పని పని... తనను నమ్మి ఓట్లు వేసిన అయిదున్నర కోట్ల ప్రజల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పడుతున్న కష్టానికి ప్రత్యక్ష్య తార్కాణం ఈ ఫోటోలు ..ఇరవై ఏళ్ల క్రితం... నాడు అమెరికాలో ఫైళ్ళు పట్టుకుని అనేక కార్పోరేట్ కార్యాలయాలకు వెళ్లి హైదరాబాద్ లో ఐటీ సంస్థలను నెలకొల్పాలని బలపం కట్టుకుని తిరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సఫలీకృతులయ్యారు...మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ ఐటీ సంస్థ అధిపతి బిల్ గ్రేట్స్ అపాయింట్ మెంట్ సంపాదించడమనే అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసుకుని... పది నిమిషాల సమయాన్ని గంటల పాటు కేటాయించేలా తన వాగ్దాటితో సద్వినియోగం చేసుకుని అసాధ్యుడనిపించుకున్నారు.నేడు తెలంగాణా హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమ వేళ్ళూనుకునేలా పరిశ్రమించారు. ఐటీ చదివిన యువత కు పది లక్షల ఉద్యోగాలు అయిదు అంకెల జీతాలతో లక్షలాది కుటుంబాలలో సౌభాగ్యం నింపిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిది ... అంతెందుకు నేడు తెలంగాణా రాష్ట్రానికి డెబ్బయి వేల కోట్లకు పైగా ప్రభుత్వ ఆదాయానికి పునాది వేసి ఆధునిక చారిత్రిక యుగపురుషుడు , ఆదాయ సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబునాయుడు ... ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి , వయసు అరవై ఎనిమిది... కుటుంబసభ్యులతో ముఖ్యంగా మనవడితో ఆడుకోవాల్సిన తరుణం.. కాలు తీసి కాలు కదపాల్సిన పని లేదు... పిలిస్తే వాహనాలు క్యూగడతాయి... అయినా వయసు ఏదైనా మిగిలిన వారికి ఉత్సాహం, ప్రోత్సాహం అందించడంలో ఆయనకు ఆయనే సాటి ...యుద్ధమైనా , ఉద్యమంలోనైనా ముందుండి నడిపించేవాడే అసలైన, నిజమైన, నిఖార్సయిన నాయకుడు, పాలకుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రమె ..అది మన తరం, జనం చేసుకున్న పుణ్యం ...న్యూయార్క్: తాను బస చేసిన హోటల్ నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో సమావేశంలో పాల్గొడానికి సుమారు కిలోమీటర్ నడచి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అధికారుల బృందం.