logo


97లో నాని నిర్మాత దిల్ రాజు..!

...

నేచురల్ స్టార్ నాని,నాగార్జున కలిసి నటించిన మల్టీ స్టారర్ రేపు విడుదల కానుంది. అయితే 97లో నాని ఏం జరిగి ఉంటుంది. అనుకుంటున్నారా ఏమి జరగలేదు 97అనేది సినిమా పేరు. తమిళ్ లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా తెరకెక్కింది. ఈ సినిమా తమిళ్ లో అక్టోబర్ 4న విడుదల కానుంది. 

ఈ సినిమాను చూసిన దిల్ రాజు తెలుగు రీమేక్ రైట్స్ ను దక్కించుకున్నట్టు తెలుస్తోంది. విజయ్ సేతుపతి పాత్రకు నాని సరిగ్గా సరిపోతాడని భావించిన దిల్ రాజు ఈ సినిమాను నానికి చూపించారట. ఇది చూసిన నాని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడని తెలుస్తోంది. దేవదాస్ మూవీ తర్వాత ఈ నేచురల్ స్టార్ కోసం జెర్సీ అనే సినిమా సిద్ధంగా ఉంది.