logo


లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానంటున్న బాలయ్య హీరోయిన్..!

...

బాలీవుడ్ 'ఆషిక్ బనాయా ఆప్నే'తో సూపర్ పాపులర్ అయిన హీరోయిన్ తనుశ్రీ దత్తా తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన 'వీరభద్ర' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. చాలా క్రితమే వెండితెరకు దూరమైన ఈ భామ తాజాగా కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించింది. తను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినేని తెలిపింది. 

'కాస్టింగ్ కౌచ్ ఇప్పుడే కాదు నేను నటించే సమయంలోనూ ఉంది. నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే. 2008లో ఓ సినిమా షూటింగ్ సమయంలో ఓ సహనటుడు నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. డ్యాన్స్ భంగిమలు నేర్పుతానని చెప్పి నా శరీరాన్ని అసభ్యంగా తాకాడు. నాతో పాటు చాలా మంది హీరోయిన్లు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నవారే. హీరోయిన్ల బాధలను ఎవ్వరూ పట్టించుకోరు'అని తనుశ్రీ ఆవేదన వ్యక్తం చేసింది.