logo


వెండితెర గొంతు ఘంటసాల గారి జీవిత చరిత్ర..

...

వెండితెర గొంతు ఘంటసాల గారి జీవిత చరిత్రను కూడా వెండితెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఘంటసాల గారు అమరులై నాలుగు దశాబ్దాల అయిన కూడా ఇంకా ఆయన పాటలతో తెలుగు ప్రేక్షకుల మందిలో బతికే ఉన్నారు. అలాంటి వ్యక్తి జీవిత చరిత్రకు రంగం సిద్ధం అయ్యింది. ప్రముఖ సింగర్ కృష్ణచైతన్య, ఘంటసాల గారి పాత్రలో నటించనున్నారు. ఆయన భార్య మృదుల కీలకమైన ఘంటసాల గారి భార్య పాత్రలో కన్పించనున్నారు.చాలా కాలంగా ఘంటసాల జీవితంపై రీసర్చ్ చేసిన సిహెచ్ రామారావు ఈచిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.లక్ష్మినీరజ ఈచిత్రాన్ని నిర్మించేందుకు ముందు వచ్చారు.ఇక ఘంటసాల మూవీ అంటే సంగీతం గురించి  ఎక్కువ చర్చ  జరుగుతుంది. ఈచిత్రానికి వాసూరావు సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈచిత్రం అతి త్వరలోనే సెట్స్ మీద వెళ్లనుందని సమాచారం. పూర్తి వివరాలు అధికారికంగా త్వరలో వెల్లడికానున్నాయని ఫిల్మినగర్ టాక్.