logo


యూటర్న్ తీసుకుని భర్తతో వెకేషన్ కు వెళ్లిన్న...సమంత

...

అక్కినేని వారింటి కొడలిగా మారిన టాప్ హీరోయిన్ సమంతకు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. తాజాగా యూటర్న్ సినిమా ద్వారా మంచి మార్కులు, కలెక్షన్లు తన ఖాతాలో వేసుకున్న సమంత కాస్త బ్రేక్ దొరికే సరికి భర్త చైతుతో కలిసి ట్రిప్పేసింది. ఈ ఏడాది రంగస్థలం, మహానటి, అభిమన్యుడు, యూటర్న్ వంటి సినిమా బాక్సిఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తర్వాతి సినిమా భర్త నాగచైతన్యతో కలిసి చేయనున్న సమంత,ఈలోగా చిన్న బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకుని, అనుకున్నదే తడవుగా విహారయాత్రకు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్ తో సమంత పంచుకుంది. 'ఫైనల్లీ వెకేషన్' అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. అక్టోబర్ 6న సమంత, చైతూల వివాహ దినోత్సవం కాగా, అదే రోజున వీరి కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఆ సమయానికి సమంత తన టూర్ ను ముగించుకుని తిరిగి వస్తుందని సమాచారం.