logo


వెంకటేశ్ కూతురు ప్రేమ వివాహం ..పెళ్లి పీటలు ఎక్కబోతుందా?

...

వెంకటేశ్ పెద్ద కూతురు ఆశ్రిత ఇప్పుడు పెళ్లి పీటలెక్కబోతుందనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఈమె ప్రేమ వివాహం చేసుకుంటుందని తెలుస్తుంది. ప్రముఖ బిజినెస్ మ్యాన్ సురేందర్ రెడ్డి మానవన్నీఆశ్రిత ప్రేమించిందని ఆయనతోనే త్వరలోనే ఏడడుగులు నడవబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే అబ్బాయి  తరుపు పెద్దవాళ్లతో సురేష్ బాబు   మాట్లాడారట. ప్రస్తుతం వెంకటేశ్ 'ఎఫ్ 2' సినిమా షూటింగు కోసం విదేశాల్లో వున్నారు. ఆయన అక్కడి నుంచి తిరిగిరాగానే కూతురు నిశ్చితార్థ వేడుకను నిర్వహించనున్నట్టు చెప్పుకుంటున్నారు. వచ్చే ఏడాది మార్చిలో పెళ్లి జరగవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఆశ్రిత ఫారిన్ లో బేకరీ రంగంలో శిక్షణ తీసుకుంది. 'ఇన్ఫినిటీ ప్లేటర్ ' పేరుతో సిటీలో పలు స్టాల్స్ ను ఆమె నిర్వహిస్తోంది.