logo


ప్రాజెక్టులు పూర్తిగా చంద్రబాబు కృషి చేస్తున్నారు..!

...

రాయలసీమలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టుల పూర్తిగా చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమా తెలిపారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ నాలుగేళ్లలో ఇరిగేషన్ కు రూ.58 వేల కోట్లు ఖర్చుచేశామన్నారు. అవుకు టన్నెల్, గోరుకళ్లు రిజర్వాయర్లను పూర్తి చేశామని చెప్పారు. అవుకు సొరంగం పనుల్లో వైఎస్ హయాంలో జరిగిన అక్రమాలపై జగన్ సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. జలయజ్ఞాన్ని వైఎస్ ధనాయజ్ఞంగా మార్చారని ఆరోపించారు. పులివెందుల రైతులకు నిళ్లిచ్చిన చంద్రబాబుదే అని  మంత్రి   దేవినేని ఉమా చెప్పుకొచ్చారు.