logo


అదో దుష్టచతుష్టయ కూటమి..!

...

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. అధికార, విపక్ష పార్టీలు పరస్పర మాటల యుద్ధానికి పదునుపెట్టాయి. రాష్ట్రంలో, కాంగ్రెస్, తేదీపా, సీపీఐ, తెజాసలతో ఏర్పాటైన మహా కూటమి పై నిజామాబాద్ ఎంపీ కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. నిజామాబాద్లో పర్యటించిన ఆమె పలు వినాయక మండపాలనుసందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాకూటమి ఓ దుష్టచతుష్టయ కూటమి అన్నారు. తెలంగాణ ప్రజలపాలిట అదో శాపమని ఎద్దేవా చేశారు. ఓట్ల గల్లంతు విషయంలో కాంగ్రెస్ పార్టీ కావాలనే తమ పార్టీ పై బురదజల్లుతోందని ఆరోపించారు. కాంగ్రెస్, తెదేపాలు ఇప్పటికే ప్రజలను పిక్కు తిన్నాయని, రాబోయే ఎన్నికల్లో వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. గత అరవై     ఏళ్లలో జరగని అభివృద్ధి ఈ నాలుగేళ్లలో కేసీఆర్ చేసి చూపించారని కవిత అన్నారు.