logo


నేను చెప్పింది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు..!

...

రానా దగ్గుబాటి ఏకకాలంలో అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ లో రాణిస్తున్నాడు. బాహుబలి సినిమా తర్వాత నేషనల్ స్టార్ గా మారిపోయాడు మన భాల్లాలదేవ. ఆ సినిమా అయిన తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. బాలీవుడ్ లోనూ మంచి ఆఫర్లు కొట్టేస్తున్నాడు. ఆయన నటించిన బాహుబలితో పాటు ఘాజి,నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. ఆయన ఇటీవల ఓ ఆంగ్లపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో తాను మాట్లాడింది ఒకటైతే మరొకటి ప్రచురించారని అసలు తాను మాట్లాడింది సరిగా వినలేదని ట్విటర్ ద్వారా తెలిపాడు రానా. ఆ పత్రిక 'నాకు బాలీవుడ్ లో ఏదీ ఇంట్రస్టింగ్ గా లేదు' అని రానా అన్నట్టుగా ఓ టైటిల్ ఇచ్చి వార్తను ప్రచురించింది. దానిని చూసిన రానా 'మీరు నేను చెప్పిందంతా తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు క్లియర్ గా వినలేదు' అని పేర్కొన్నారు.