logo


కోర్టుకు హాజరుపై చంద్రబాబు కీలక నిర్ణయం..!

...

బాబ్లీ ప్రాజెక్టు కేసు వ్యవహారంలో తన తరపున న్యాయవాదిని పంపించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నిర్ణయించారు. తన తరపున రీకాల్ పిటిషన్ వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పలువురు మంత్రులు, సీనియర్ నేతలు, ఇతర అధికారులతో చర్చించి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

మహారాష్ట్రలోని ధర్మబాద్ కోర్టు ఇటీవల చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి విషయం తెలిసిందే. ఈ నెల 21వ తేదీన చంద్రబాబు సహ 16 మంది కోర్టుకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై పలువురితో చర్చించిన అనంతరం లాయర్ ను పంపించాలని, రీకాల్ పిటిషన్ వేయాలని నిర్ణయించారు.