logo


ఎన్టీఆర్ కి దిష్టితగులుతుందా..?

...

ఎన్టీఆర్ 'అరవింద సమేత' నుండి ఈరోజు మరో సింగల్ విడుదల చేయబోతున్నారు. పెనిమిటి అనే సాంగ్. ఈ పాట గురించి ట్విట్టర్ అప్పుడే హోరెత్తుతోంది. ఇలాంటి పాట రాసే అవకాశం తనకు రావడం తన అంటున్నారు రామజోగయ్య శాస్త్రి. మళ్లీ మళ్లీ చెప్తున్నా, ఇది మామూలు పాట కానే కాదు అంటున్నారు. 

తాజాగా మరో ట్వీట్ చేశారు. తారక్ ఫోటో గురించి ఆయన ఎలాంటి కామెంట్ చేయకుండా 'నేనేమీ అనను దిష్టితగులుతుంది' అని సరదాగా క్యాప్షన్ ఇచ్చారు. అలాగే ఇందులో పూజా హగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఈషా తారక్, త్రివిక్రమ్ తో కలిసి సెల్ఫీ దిగారు. ఈ ఫోటోను ట్విటర్ లో పోస్ట్ చేస్తూ 'కూలెస్ట్ పీపుల్ ఆన్ సెట్స్ ఆఫ్ అరవింద సమేత' అని ట్వీట్ చేశారు. హారిక హాసిని క్రియెషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దసరాకు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.