logo



పెళ్లి పల్లకి మోసిన ప్రభాస్

...

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది . రాజస్ధాన్ రాజధాని జయపూర్ లోని ఓ ప్యాలెస్ లో వీరి వివాహ వేడుకను కన్నుల పండుగగా సాగింది. ఆదివారం రాత్రి వరుడు కార్తికియ, వధువు పూజా ప్రసాద్ వివాహ బందంతో ఒక్కటయ్యారు . వేడుకకు రెండు రోజుల ముందే ప్రముఖులు ప్రభాస్ , ఎన్టీఆర్ , రామ్ చరణ్ , ఉపాసన , అనుష్క, ఎం ఎం కీరవాణి , జగపతిబాబు , రానా తదితరులు హాజరయ్యారు . రాత్రి జరిగిన పెళ్లి వేడుకలో పెళ్లి కుమరై కూర్చున్నా పల్లకిని ఆమె బంధువులతో పాటు ప్రభాస్ కూడా మోశాడు . ప్రభాస్ పల్లకి మోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అంతకు ముందు సంగీత్ తారక్ ప్రభాస్ చరణ్ , రానా రాజమౌళి కుటుంబీకులతో కలిసి హంగామా చేశారు డ్యాన్సు లతో సందడి చేశారు ప్రస్తుతం రాజమౌళి, ఎన్టీ ఆర్ రామ్ చరణ్ లతో ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కిస్తున్నారు . ఈ పెళ్లి వల్ల షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు ఈ హంగామా పూర్తయిన వెంటనే షూటింగ్ మొదలుపెట్టనున్నారు .